SAKSHITHA NEWS

ఎల్.ఐ.సి. డివిజనల్ ఆపీస్ ఎదుట ఎఓఐ ధర్నా

పెండింగ్ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని ప్రకటన

కరీంనగర్ :

కరీంనగర్ లోని భారతీయ జీవిత భీమా సంస్థ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదుట శుక్ర వారం ఎల్. ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనై జేషన్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాలసీదారుల ప్రయోజనాల కోసం, ఎజెంట్ల భవిష్యత్ కోసం rపెండింగ్ లో ఉన్న పలు డిమాండ్ల ను వెంటనే సంస్థ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎల్.ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ, రాష్ట్ర, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నాయకులు మాట్లాడుతూ డిమాండ్ల సాధన మా హక్కు అని, న్యాయమైన డిమాండ్ల ను మాత్రమే సంస్థ దృష్టికి తీసుకెళ్లి వాటి అమలు కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు.
పెరిగిన ధరల కనుగుణంగా ఏజెంట్ల కమీషన్ ను పెంచాలన్నారు. “క్లాబ్యక్ ఆఫ్ కమిషన్” నిబంధనన రద్దు గురించి సర్కులర్ రూపంలో అధికారికంగా ప్రకటించాలన్నారు.
ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు.
గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజి ఏజెంట్లకు 50 లక్షలకు క్లియా ఏజెంట్లకు 1 కోటి వరకు పెంచాలన్నారు.
గ్రాట్యుటీ పై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, ఏజెంట్ల గ్రాట్యుటీ లెక్కించే విధానంలో మార్పులు చేయాలన్నారు.

క్లబ్ మెంబర్ 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన ప్రతి ఏజెంట్ ను లైఫ్ మెంబర్ గా పరిగణించాలన్నారు.
బ్రిగేడ్ షిప్ సాధించిన క్లీయా లకు క్లబ్ రిలాక్సేషన్ ఇచ్చి ఆఫీస్ అలవెన్స్ ఇవ్వాలన్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
ఎలసి లో FDI ల పరిమితి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్ ప్రతిపాదనలు రద్దు చేయాలన్నారు.
ఏజెంట్లకు ఇపియఫ్, ఇయస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు.
చర్చల సందర్భంగా యాజమాన్యం ఇచ్చిన హామీల అమలు కోసం పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా దశల వారి పోరాటాలు నిర్వహించి వాటిని అమలు చేయించు కొని తీరుతామని ప్రకటించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. మంజునాథ్, స్టేట్ జనరల్ సెక్రటరీ తన్నీరు కుమార్, కోశాధికారి కొత్తపెళ్లి రాంనర్సయ్య, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు పి.రాజబాబు రెడ్డి, జగిత్యాల బ్రాంచి అధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్, నాయకులు గాదాసు శ్రీనివాస్, రేగొండ లక్ష్మి కాంతం, రౌతు నర్సయ్య, ఏనుగు గంగారెడ్డి, ఆనంద రెడ్డి, కాసారపు లక్ష్మి నారాయణ, నిజాం నాగరాజు, రాజిరెడ్డి, వి. వెంకటేశ్వర్లు, బి.తిరుపతిరావు, తిరుపతి, మహేష్, కుమారస్వామి, ముత్తె రమేష్, భూమయ్య, సుధాకర్, శ్రీనివాస్, ఆశిర్ విల్సన్, ఎల్ఐసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామ్మోహన్ రావు, వామన్ రావు, బసవేశ్వర్, ఆర్వి రమణ, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS