127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయ్ నగర్ కాలనీ, మారుతి నగర్ లలో101వ రోజు ప్రగతియాత్ర..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయ్ నగర్ కాలనీ, మారుతి నగర్ లలో 101 రోజు ప్రగతి యాత్ర లో బాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్ గారు స్థానిక కార్పొరేటర్ బి. విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి పర్యటించారు,అనంతరం పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివుద్ది పనులను పరిశీలించి మిగిలి ఉన్న సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు, మౌలిక సదుపాయాలు కల్పించి తమ కాలనీలను అభివ్రుది పరిచినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మంగళ హారతులతో ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఇచ్చిన మాట ప్రకారం కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు కాలనీవాసులంతా ఎమ్మెల్యే గారి వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నసంబంధిత అధికారులకు వ్యయప్రణాళికలు సిద్ధం చేసి వాటిని త్వరతగినగా పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీచేశారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను శాశ్వతంగా అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు,బీఆర్ఎస్ హయాంలో ప్రతి కాలనీ, బస్తీ రూపురేఖలు మారుతున్నాయన్నారు, సంక్షేమ సంఘాలు ఇదే ఐక్యతతో ఉంటూ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు