నవంబర్లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు
తిరుమల తిరుపతి : నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు.