SAKSHITHA NEWS

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ కి చెందిన ప్రభుదాస్ కి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF -LOC మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF – LOC వివరాలు

1.కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ కి చెందిన ప్రభుదాస్ కి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయలు.
మొత్తం 1,00,000/- ఒక లక్ష రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విఠల్ , మధు, రాము, రాధ బాయి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS