SAKSHITHA NEWS

100 services left in the air by the officials 100 people who want to call

100 సేవలు గాలికి వదిలేసిన అధికారులు100కు కాల్ చేయాలంటే జంకుతున్న జనం

*డిసెంబర్ 4 సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో నామమాత్రపు కాల్ ఐనా 100 ఎవరు పూర్తి వివరాలకు వెళ్తే . సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేస్తున్న 100కాల్స్.కుఉన్న అధికారులు . .

*గ్రామాల్లో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా. గంజాయి విక్రయాలు. పేకాట సవరణలు బెల్టు షాపులు.100 కు సమాచారం ఇచ్చిన వ్యక్తులపై పగలు పెంచుకుంటున్న అక్రమ వ్యాపారం చేసే వ్యక్తులు . ………….సమాజంలో రోజురోజుకీ నేరాలు ఘోరాలు తారా స్థాయికి చేరాయి సామాన్యులు తమకు ఎందుకు అనే పరిస్థితి నెలకొంది.దీనికి ప్రధానకారణం సమాచారం ఇచ్చిన వ్యక్తి గురించి కొందరు సంబంధిత అధికారులే నిందితులకు అక్రమాలు చేసే వారికి సమాచారం ఇస్తున్నారు.

దీంతో నిందితులు సదురు వ్యక్తి పై కక్షలు పెంచుకొని దాడులకు పాల్పడుతున్నారు. ఫలితంగా కొందరు అన్యాలకు ఎదిరించాలని అనుకున్న ఆచరణలో పెట్టడానికి జంకుతున్నారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం శాంతి భద్రతలను కాపాడడానికి తమ్మున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో నేరాల నియంత్రణలో విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమాచారం తెలిపిన వారిపై దాడులు. సమాజంలో ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ఎవరు భయపడొద్దు. మీకోసమే ఉన్నామంటూ పోలీసులు ధైర్యం చెబుతున్నారు. అయితే అసలు సమస్య ఇక్కడ ఆరంభంఅవుతుంది.అన్యాయాలపై ధైర్యం చేసి 100 నెంబర్ కు 112 కు డయల్ చేస్తే వెంటనే సదరు వ్యక్తి మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లి చూడండి అని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెంటనే 100 నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం ఇస్తారు. ఇసుక మాఫియా ఆగడాలు పేకాట ప్రదేశాలు బెల్టు షాపులు మహిళలపై అఘాయిత్యాలు రోడ్డు ప్రమాదాలు ఇతరత్రా సంఘటనపై ఎవరైనా హండ్రెడ్ కు సమాచారం ఇవ్వచ్చు. 100 నెంబర్ డయల్ చేసి సమాచారం ఇస్తే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు.

అనంతరం కాల్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించి అమ్యమ్యలకు ఆశపడి నిందితులకు ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు చెబుతున్నారు. దీంతో నిందితులు ఫోన్ చేసిన వ్యక్తిపై కక్షలు పెంచుకొని వారిపై దాడులు చేసిన సంఘటన అనేకం మండలంలో చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ పోలీసు ఉన్నత అధికారులు 100 డయల్ కు కాల్ చేసి సదరు వ్యక్తుల సమాచారం రహస్యంగా ఉంచాలని కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగే . అక్రమ ఇసుక రవాణా. గంజాయి విక్రయాలపై బెల్టు షాపులు. పేకాట. బెల్ట్ షాపుల పై తక్షణమే చర్యలు తీసుకోవలని గ్రామస్తులు. మండలాల ప్రజలకు కోరుతున్నారు.


SAKSHITHA NEWS