
యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి
మంత్రి లోకేష్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు రాజా, రాజశేఖర్
అమరావతి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ మంగలగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను మంత్రి అభినందించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనను కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో దేవినేని ఉమ, నెట్టెం రఘురాం, ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app