యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా
యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా
యువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకాలు వేయడం వల్లే అటువంటి మరణాలు తగ్గుతాయని అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. మొత్తం 729 ఆకస్మిక మరణాలు, 2,916 కేసులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకోవడం వల్ల ఆకస్మిక మరణాల సంఖ్య తగ్గినట్లు వెల్లడైనట్లు పేర్కొన్నారు.