
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ PJR నగర్ లో అక్షయ విద్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో , GHMC సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ విద్య కమ్యూనిటీ లెర్నింగ్ & స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు , కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహన్ , UCD అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి , కూకట్పల్లి డీసీ గంగాధర్ , బాలానగర్ DCP సురేష్ కుమార్ , బాలానగర్ ACP హన్మంత రావు , CI నర్సింహ , కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ కి స్వాగతం సుస్వాగతం .
అక్షయ విద్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో , GHMC సహకారంతో అక్షయ విద్య కమ్యూనిటీ లెర్నింగ్ & స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఎల్లమ్మ బండ ప్రాంతంలో ప్రారంభించుకోవడం చాల సంతోషకరమైన విషయం అని, ఇక్కడి ప్రాంత పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని , ఈ చక్కటి సదావకాశంను సద్వినియోగపర్చుకొని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
అక్షయ విద్య ఫౌండేషన్ సేవలు అమోఘం, పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే కాంతి రేఖ అక్షయ విద్య ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
12 ఏళ్ల నుంచి అక్షయ విద్య ఫౌండేషన్ బడుగు, బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తుంది.
పేదవాళ్ల యొక్క జీవితాలు విద్య ద్వారానే మారుతోందని ఒక వ్యక్తి గనుక చదువుకుంటే మూడు తరాల తలరాత మారుతుంది అనే సిద్ధాంతంతో వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తుంది.
ఈ 12 ఏళ్లల్లో సాధించినటువంటి విజయాలను స్మరించుకుంటూ
500 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారు.
విప్రో, గూగుల్, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైన పోస్టల్ డిపార్ట్మెంట్,డీ.ఎ.స్సీ లో ఉద్యోగాలు సాధించారు.
ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఖరగ్పూర్ లాంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు.
తల్లిదండ్రులు లేని, విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి,వారి ఉన్నత చదువులకి స్కాలర్ షిప్ ను అందించడం.
సాంకేతిక విద్యా నైపుణ్యాలు మెరుగుపరచడం కొరకు 200 కు పైగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయడం జరిగినది.
ఈ రోజు చదువులతో పాటు సాంకేతిక, నైపుణ్యలను పెంపొందించుకుంటే విజయం సిద్ధిస్తుంది
ఆకాశమే హద్దుగా ప్రపంచం శాస్త్ర ,సాంకేతిక నైపుణ్యాలు అస్త్రాలతో దూసుకుపోతుంది.
డిజిటలీకరణ , యాంత్రీకరణ ,కృత్రిమ మేధా విజృంభనలతో ఉద్యోగ విపణి లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి .
విద్యార్థులు సృజనాత్మకత ,వినూత్నతకు గుణాత్మకమైన నైపుణ్యాలు జోడిస్తూ నవీన ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు పొందాలి
విద్యార్థులు విశాల దృక్పథం ,కుతూహలం ,కొత్త విషయాల పై ఆసక్తి కలిగివుండాలి, మంచి ప్రణళికతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ,చదవలనే తపన కష్టపడే తత్వం ,క్రమశిక్షణ ఉంటె ఎంతటి విజయం అయినా స్వంతం అవుతుంది
మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ,సమాజంకు మంచి పేరు ప్రఖాతులు తీసుకురావాలి అని PAC చైర్మన్ గాంధీ విద్యార్థులకు తెలియచేశారు. అక్షయ విద్య ఫౌండేషన్ వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app