వియజశ్రీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికుడుకి గాయం.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సాయంత్రం పరిశ్రమలో లిఫ్ట్ మొరాయించడంతో కనకారావు అనే కార్మికుడు ఒక రాడ్ సహాయంతో లిఫ్ట్ సరిచేస్తుండగా ఒక్కసారిగా 20 మీటర్ల కిందికి పడడంతో కార్మికుడు కూడా లిఫ్ట్ తో పాటుగా పడిపోయి గాయపడ్డాడు. విషయం తెలుసుకొని స్థానిక విలేకరులతో గని శెట్టి మాట్లాడుతూ గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీస్శాఖల అధికారులుసమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కార్మికుడు కోలుకునే వరకు పూర్తిస్థాయిలో వేతనం చెల్లించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు.