నేర నివారణకు, చేధనకు గట్టిగా పని చేయండి . జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

Spread the love

Work hard to prevent crime. District SP Siddharth Kaushal IPS

నేర నివారణకు, చేధనకు గట్టిగా పని చేయండి . జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా

జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన . జిల్లా ఎస్పీ .
వారంలోపు పెండింగ్ లో ఉన్న చార్జీషీట్లు పూర్తి చేయండి. యుఐ కేసులు బాగా తగ్గించాలి. లోక్ అదాలత్ లో పోలీసు అధికారులు, సిబ్బంది బాగా పని చేశారని అభినందించిన .

జిల్లా ఎస్పీ.
నేరాల నివారణకు అందరూ గట్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధ్యతగా పని చేసి పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలన్నారు.

కర్నూలు , పత్తికొండ , ఆదోని సబ్ డివిజన్ లోని పెండింగ్ కేసుల గురించి జిల్లా ఎస్పీ గారు సమీక్షించారు. పెట్రోలింగ్ వాహానాల తో రాత్రి గస్తీ ని ముమ్మరం చేయాలన్నారు. గస్తీ ని డిఎస్పీ స్ధాయి అధికారులు పర్యవేక్షించాలన్నారు. అసాంఘిక కార్యకలపాలు జరగకుండా చూడాలన్నారు.

లోక్ అదాలత్ లో అందరూ బాగా పని చేశారన్నారు. రాష్ట్రంలోని జిల్లాలతో పోలీస్తే అనంతపురం, తర్వాత కర్నూలు జిల్లానే బెస్ట్ గా ఉందన్నారు.వారంలోపు పెండింగ్ లో ఉన్న వాటికి వెంటనే చార్జీ షీట్లు ఫైల్ చేసి కోర్టుకు అందజేయాలన్నారు. చార్జీషీట్లు ఫైల్ చేసిన వాటికి దాదాపు 2000 పైన కోర్టుల నుండి సిసి నెంబర్స్ రావాలన్నారు. సిసి నెంబర్ల కొరకు ఆయా కోర్టుల జడ్జీలను కలవడం జరిగిందన్నారు.


పెండింగ్ లో ఉన్న కేసుల గురించి పోలీసుస్టేషన్ ల వారీగా పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
5 వారాల్లో 2022 సంవత్సరం ముగిసిపోతుందని , ఇయర్ ఎండింగ్ లోపు పెండింగ్ కేసులు బాగా తగ్గించాలన్నారు.
చాలా సంవత్సరాలుగా పేరుకు పోయిన కొన్ని పోలీసుస్టేషన్ లలో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య తగ్గితే జిల్లా మొత్తం మీద ఆ భారం తగ్గుతుందన్నారు. రికవరీలు బాగా చేయాలన్నారు.

పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న కేసులు పరిష్కారం అయ్యే దిశగా చూడాలన్నారు. స్దగ్ ఎస్ డి జి( సూస్తాయినబ్లె డెవలప్మెంట్ గోల్స్ ) సుస్థురాభివృద్ధి లక్ష్యాలను ప్రతి శాఖకు ఇచ్చారన్నారు. సిఎమ్ ఆఫీసు నుండి మానిటర్ చేస్తున్నారని వీటి పై పోలీసు అధికారులు దృష్టి సారించాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి జిగ్ జాగ్ రేడియం తో బారీ కేడ్స్ ను ఏర్పాటు చేయించాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, యుగంధర్ బాబు , వినోద్ కుమార్, నాగభూషణం, శ్రీనివాసులు, కెవి మహేష్, డిపిఓ ఎఓ సురేష్ బాబు మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page