SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయండి

శ్రీకాకుళంజిల్లా లావేరుమండలం లక్ష్మీపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోఉపాధ్యాయిని పి.వసంత లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పాటుపడుతుందని వెల్లడించారు.విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, జగనన్న కిట్లు,అమ్మ ఒడి,మధ్యాహ్నం భోజనం వంటి ఉచితంగా అందిస్తున్నట్లు వాళ్లు వెల్లడించారు.విద్యా బోధన సక్రమంగా అందిస్తున్నట్లు వాళ్లు వివరించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పుస్తకాలకు అధిక మొత్తం వెచ్చించాలని అవి ఏవి లేకుండా నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు మీ పిల్లలను పంపించాలని అన్నారు.మేము నాణ్యమైన బోధన అందిస్తున్నామని ఈ విషయం గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు గమనించాలని వాళ్లు కోరారు.ఈ సమావేశంలో సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ,ఎంపీటీసీ కాగితాల కృష్ణారెడ్డి,పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బోర రూపవతి,చాట్ల రమణ,మాజీ సర్పంచ్ దల్లి రాజారావు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS