SAKSHITHA NEWS

లక్ష్మీపార్వతికి ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరణ

తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో ఆమె బాధ్యతలు చేపట్టిన సమయంలో వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యత ఇచ్చారు. తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించినట్లు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS