నాకు రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలి..
కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన రైతు పండుగ ఫ్లెక్సీ వద్ద రైతు నిరసన
కరీంనగర్ – తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన చింతల మల్లారెడ్డి తీసుకున్న రూ.1.09 లక్షల వ్యవసాయ రుణం మాఫీ కాకపోవడంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రైతు పండుగ ఫ్లెక్సీ వద్ద గంటకుపైగా నిల్చుని నిరసన తెలిపాడు.
తాను సక్రమంగానే వడ్డీ చెల్లించినా.. తన పేరును రుణమాఫీ జాబితాలో చేర్చకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించాడు.