0 0
Spread the love

Read Time:1 Minute, 53 Second

ఎవరెన్ని కుట్రలు చేసిన మళ్ళీ టిఆర్ఎస్ దే అధికారం

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నల్లగొండ జిల్లా (సాక్షిత): ఎవరెన్ని కుట్రలు చేసిన మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాడు చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో 30 లక్షల పైచిలుకు వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామంలో 20 లక్షల సిసి రోడ్లు, డ్రెయినేజీ పనులతోపాటు 10 లక్షలతో నిర్మించనున్న వడ్డెర సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నివర్గాల ప్రజల ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పేదప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను తీసుకొచ్చారన్నారు. బిజెపి, కాంగ్రెస్ లవి భూటకపు మాటలని, వారు చేసే దుష్ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని మండిపడ్డారు, ఎవరెన్ని కుట్రలు చేసినా, తలక్రిందులుగా తపస్సు చేసినా కేసీఆర్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page