తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు

Spread the love

బాపట్ల

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు సవివరంగా వివరిస్తూ ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమంలో భాగంగా శనివారం పిట్లవానిపాలెం మండలం, కొత్తపాలెం గ్రామంలో పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి ఇంటింటికి వెళ్లి మహిళమణులకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకొనే ఒక సంచి, తన గురించి తెలియజేసే ఒక కరపత్రాన్ని అందజేసి తనని ఆశీర్వదించమని కోరారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ కామెంట్స్..

బాపట్ల నియోజకవర్గంలో మా వేగేశన ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాలతో ప్రతి ఒక్కరూ నన్ను వారి కుటుంబ సభ్యుడిలా భావించి స్వాగతించడం సంతోషంగా ఉంది.

రాజకీయలకతీతంగా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం..

రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురుంచి ప్రజలకు సవివరంగా వివరిస్తూ ముందుకు సాగుతున్నాం.

తన మీద నమ్మకంతో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే కలిసి బాపట్ల ను అభివృద్ధి చేసుకొందమని, అవినీతి లేని పారదర్శక పాలన అందిస్తామని నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పిట్లవానిపాలెం మండల మరియు కొత్తపాలెం గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page