
సమస్యలు పరిష్కరించేందుకే వార్డు పర్యటనలు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
17వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే….
ప్రజలతో మమేకమవుతు ద్విచక్ర వాహనంపై తిరిగిన ఎమ్మెల్యే రాము దృష్టికి తమ సమస్యలు తీసుకొచ్చిన స్థానికులు
గుడివాడ : నేరుగా వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి సత్వర పరిష్కారానికి కృషి చేసేందుకే వార్డు పర్యటనలు నిర్వహిస్తున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
గుడివాడ పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబుతో కలిసి ఎమ్మెల్యే రాము పట్టణంలోని 17వ వార్డులో.. విస్తృతంగా పర్యటించారు.
ప్రజలతో మమేకమవుతూ ద్విచక్ర వాహనంపై తిరిగిన ఎమ్మెల్యే రాము దృష్టికి స్థానికులు తమ సమస్యలు తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము.. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకున్నారు… ఇతర సమస్యలను కూడా త్వరగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకే గ్రామాల్లో మరియు పట్టణంలోని వార్డుల్లో స్వయంగా పర్యటనలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. వార్డులకు వచ్చినప్పుడు తనను కలవలేకపోయిన ప్రజలు… ప్రజావేదిక కార్యాలయంలో తమ సమస్యల అర్జీలను ఇవ్వవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా నేను, ప్రజా వేదిక కార్యాలయం నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రాము పర్యటనలో 17వ వార్డు కూటమి నాయకులు, వార్డు పెద్దలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app