ప్రాణ రక్షణ ప్రక్రియ (CPR – కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) పై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరెట్ కాన్ఫెరెన్స్

Spread the love

ప్రాణ రక్షణ ప్రక్రియ (CPR – కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) పై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరెట్ కాన్ఫెరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు *


సాక్షిత : MLC బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, సీపీ ఏ. వి. రంగనాథ్ , అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ, వాత్స తదితరులు.
అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు, చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను నేడు మనం ఎన్నో చూస్తున్నాం
ఈ కార్డియాక్‌ అరెస్ట్‌ ద్వారా వ్యక్తులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అత్యవసరం.
గుండెపోటు వచ్చిందంటే.. దవాఖానకు చేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది.

అందుకే గుండెపోటుకు గురైన వారికి సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ CPR పైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది
అత్యంత కీలకమైన కార్డియో పల్మనరీ రీససిటేషన్(సిపిఆర్). పైన ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
సిపిఆర్ అనగా కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్(CPR)
సీపీఆర్ అనగా వ్యక్తి యొక్క గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్ననప్పుడు వెంటనే ప్రాణ రక్షణ ప్రక్రియ(CPR) చేపట్టాలి.
గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ప్రాణాలను రక్షించే విధానం CPR.
గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడ వచ్చును
తీవ్రమైన గుండెపోటు ద్వారా గుండె కొట్టుకోవడం ఆగిపోయిన శరీరంలో రక్తం మరియు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది.
అప్పుడు శరీరంలో ఎటువంటి కదలికలు ఉండవు. అప్పుడు శ్వాస ఆడదు, పల్స్ అందదు. అటువంటప్పుడు ఈ సి.పి.ఆర్ ను వెంటనే ప్రారంభించాలి.
మనిషి ఆక్సిజన్‌ను తీసుకోలేనప్పుడు గుండె ఆక్సిజన్ పంపింగ్ ఆగిపోతున్న సమయంలో ప్రధమ చికిత్స గా ఉపయోగ పడుతుంది.
దాంతో మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చు. సరైన వైద్యం తీసుకునే ముందు లేదా అంబులెన్స్ వచ్చే లోపల ప్రథమ చికిత్స పై అవగాహన ఉన్నవారు ఎవరైనా ఈ ప్రక్రియను చేయవచ్చు.
సిపిఆర్ ప్రక్రియను గుండె ఆగి పోయిన వెంటనే నిర్వహించడం వల్ల బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒకవేళ ఎమర్జెన్సీ సమయంలో సిపిఆర్ ప్రక్రియను కొనసాగించక పోతే మూడు నుండి నాలుగు నిమిషాలు తర్వాత ఆక్సిజన్ లేకపోవడంతో మనిషి బ్రెయిన్‌ డెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
తెలంగాణ ప్రభుత్వం ఈ సి.పి.ఆర్ పై హెల్త్ కేర్ వర్కర్స్, మునిసిపల్ ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి, వాలంటీర్లు, షాపింగ్ మాల్ ఉద్యోగులకు, రెసిడెంట్ కాంప్లెక్స్ లకు మరియు ఇతరులకు సి.పి.ఆర్ మరియు ఎ.ఇ.డి పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
వరంగల్ జిల్లాలో నలుగురు మెడికల్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో సి.పి.ఆర్ పై మాస్టర్ శిక్షణ తీసుకొన్నారు.
వీరు రోజుకు 60కి పైగా మందికి శిక్షణను అందిస్తారు.
మొదటి దశలో మెడికల్ ఆఫీసర్స్, సూపర్ వైసర్స్, ఎ.ఎన్.యం లు మరియు ఆశా లకు శిక్షణ అందిస్తారు.
వైద్య ఆరోగ్య శాఖ లోని ఉద్యోగులకు శిక్షణ అనంతరం మిగతా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
సి.పి.ఆర్ అవసరం అయినప్పుడు వెంటనే 108 కి కాల్ చేయండి లేదా ఇతరులని చేయమని చెప్పండి
వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి శ్వాస సంబదిత అడ్డంకులను తొలగించండి.
శ్వాస తీసుకోలేకపోతే సి.పి.ఆర్ ప్రారంభించండి
30 సార్లు ఛాతిని ఒత్తండి
రెండు రెస్క్యూ శ్వాసలు ఇవ్వండి
అంబులెన్స్ లేదా ఎ.ఇ.డి(షాక్ ఇచ్చే పరికరం) వచ్చే వరకు కొనసాగిస్తూ ఉండాలి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Compare