SAKSHITHA NEWS

పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా నిర్వహించి, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారం డిప్యూటీ తాసిల్దార్ శాంతి బోషనుకి అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఎ సంఘం జిల్లా కోశాధికారి ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ నైట్ డ్యూటీలు తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ లకి డ్యూటీలు వెయ్యవద్దని వీఆర్ఎలకు విఆర్వో అటెండర్ వాచ్మెన్ ప్రమోషనల్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వీఆర్ఎల సంఘం కోశాధికారి ఎం సంతోష్ కుమార్ మరియు పరవాడ మండలం వీఆర్ఎల సెక్రటరీ ఆర్.వి.ఎన్, శంకర్ బచ్చల రాజు పైడిరాజు సన్యాసిరావు శేఖర్ రూప రేవతి కుమారి బాబురావు రాము మోహన్ పెంటరావు అప్పలరాజు కటార్ రాము పాల్గొన్నారు.


SAKSHITHA NEWS