వీఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

Spread the love

వీఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
*
సాక్షిత : యాభై సంవత్సరాలు దాటిన వాళ్లకు పదవి విరమణ ఇచ్చి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి*
వీఆర్ఏ లందరికీ పేస్కేల్ తో పాటు అర్హులైన వారికి ప్రమోషన్ల ఇవ్వాలి
*వి.ఆర్.ఎ లు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 34 రోజులుగా గ్రామ సహాయకులు విఆర్ఎ లు చేస్తున్న నిరువదిక సమ్మె కు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
వీఆర్ఏ లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని, వారికి జీతాలు పెంచి వెంటనే, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని
2020సెప్టెంబరు 9 న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న సందర్భంగా,శాసనసభ సాక్షిగా వీఆర్ఏ లందరికీ పేస్కేల్ అందిస్తామని,అర్హులకు పదోన్నతులు కల్పిస్తామని,తండ్రుల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగిందని వీఆర్ఏలు న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వి ఆర్ ఏ లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ములుగు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్

Related Posts

You cannot copy content of this page