
ప్రగతిబాటలో పల్లెలు.
‘పల్లెపండుగ’లో నిర్మించిన రహదారుల ప్రారంభోత్సవాలు.
గుంటుపల్లిలో రూ.1.65 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా/ఇబ్రహీంపట్నం,
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పల్లెలు ప్రగతిబాట పడుతున్నాయి. మైలవరం నియోజకవర్గంలో ‘పల్లెపండుగ’ కార్యక్రమంలో శంకుస్థాపన చేసిన రహదారుల నిర్మాణం పూర్తికాగా, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో రూ.1.65 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో భారీ ఎత్తున సిమెంట్ రహదారుల నిర్మాణాలను చేపట్టినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం రహదారుల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కూటమి సర్కారు నేతృత్వంలోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app