గ్రామ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే రెడ్డి శాంతి

Spread the love

Village secretariat conveners and volunteers should work in coordination: MLA Reddy Shanti

 గ్రామ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే రెడ్డి శాంతి
 సాక్షిత   :  కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన  కొత్తూరు మండల గ్రామ సచివాల కన్వీనర్లు & వాలంటీర్ల సమన్వయ సమావేశంలో  శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి  ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామ సచివాలయం వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు పలు సూచనలు చేస్తూ కన్వీనర్లు & వాలంటీర్లు  సమిష్టిగా పనిచేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జనరంజక పాలనలో అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వ్యక్తికీ అందేవిధంగా గ్రామ సచివాలయ కన్వీనర్లు మరియు వాలంటీర్లు సమన్వయంతో కలిసి పనిచేయాలని తెలియజేశారు.

కన్వీనర్లు & గ్రామ వాలంటీర్లు, పార్టీ శ్రేణులు Team Jagananna యాప్ డౌన్లోడ్ చేసుకుని మన ప్రభుత్వ సంక్షేమ పాలన వివరాలను అధిక సంఖ్యలో ప్రజలకు చేరవేయాలని తెలిపారు.

 జనవరి 3 2023 నుండి జనవరి 9 2023 వరకు నిర్వహించనున్న పెంచిన పింఛన్ల  (2500 రూపాయలు నుండి 2750 రూపాయలు) పంపిణీ వారోత్సవాలలో కన్వీనర్లు& వాలంటీర్లు పాల్గొని ప్రతీ లబ్దిదారుని కలిసి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  రాసిన లేఖను చదివి వినిపించి పింఛను సొమ్ము అందజేయాలని తెలిపారు.

 ప్రజా సంక్షేమమే తన లక్ష్యంగా.. ఆంధ్రాభివృధ్ధియే తన ధ్యేయంగా అనునిత్యం నిర్విరామ కృషి చేస్తున్న జననేత జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయఢంకా మోగించేలా గ్రామ సచివాలయ కన్వీనర్లు & వాలంటీర్లు కృషి చేయాలని ఈ సమావేశంలో తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page