సచివాలయ వ్యవస్థలో తొలి కారుణ్య నియామకం వసంతాభాయ్

Spread the love


Vasanthabhai was the first compassionate appointment in the Secretariat system

సచివాలయ వ్యవస్థలో తొలి కారుణ్య నియామకం వసంతాభాయ్


సాక్షిత : * తిరుపతి జీవకోన సచివాలయంలో ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తూ ఏప్రిల్ నెలలో మృతి చెందిన మోహన్ నాయక్ స్థానంలోనే కారుణ్య నియామకం క్రింద ఆయన భార్య వసంతాబాయ్ కి అదే సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించడం జరిగింది. కృతజ్ఞతగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలిని కలిసి ఆమె ధన్యవాదాలు తెలియజేసారు. రా

ష్ట్ర సచివాలయ చరిత్రలో కారుణ్య నియామకం క్రింద తిరుపతి సచివాలయంలో ఉద్యోగం పొందడం మొట్టమొదటి వ్యక్తిగా వసంతాభాయ్ నిలిచింది. తనకు కప్పడానికి తీసుకొచ్చిన శాలువను తీసుకొని ఆమెకే కప్పి అభినందనలు తెలియజేసారు కమిషనర్ అనుపమ అంజలి.

ఈ సందర్భంగా వసంతాభాయ్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం నుండి తిరుపతికి సచివాలయ ఉధ్యోగ నిమిత్తం రావడం, భర్త అనారోగ్యంతో మృతి చెందడం, తన ఇద్దరు చిన్న పిల్లలతో ధీనవస్థలో వుండగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి తమ ధీన పరిస్థితి వివరించగా,

ఆయన సూచనలతో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి ప్రత్యేక చొరవతో పై అధికారులతో మాట్లాడి తనకు తిరిగి తన భర్త పనిచేసిన సచివాలయంలోనే అడ్మిన్ సెక్రటరీగా నియమించడం జరిగిందన్నారు. మరోసారి ఆమె ఎమ్మెల్యే భూమనకు, మేయర్ శిరీషకు, కమిషనర్ అనుపమ అంజలికి, అదనపు కమిషనర్ సునీతకు, సూపర్డెంట్ పి.రవి, ఆర్.ఐ నవీన్ లకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

Related Posts

You cannot copy content of this page