
కాంగ్రెస్ ఈగల్” కమిటీలో వంశీచంద్ కు చోటు
ఏఐసీసీ ఎనిమిది మంది సభ్యులతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యున్నత ఎన్నికల నిపు ణులు, సాధికారిత కమిటీలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు లభిం చింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగో పాల్ నుంచి ఆదివారం ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ఈగల్ కమిటీలో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించగా అది వంశీచంద్ రెడ్డికే దక్కింది. స్వేచ్ఛ, న్యాయ పూర్వక ఎన్నికలను పర్యవేక్షిం చేందుకు ఈ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానిత సభ్యునిగా కొనసా గుతున్న వంశీచంద్ రెడ్డికి.. ఈగల్ కమిటీలో మరో అవకాశం రావడం పట్ల కల్వకుర్తి నియోజకవర్గ నాయ కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని బాధ్యతగా, సమర్థవంతంగా నిర్వహి స్తానని వంశీచంద్ రెడ్డి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app