
రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్
సాక్షిత వనపర్తి జనవరి 18
వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అండర్ 11 ఇయర్స్ స్థాయి చెస్ పోటీలలో వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన డాక్టర్ రవిచంద్ర శిరీష కుమారుడు రవీష్ చంద్ర జూనియర్ చెస్ 11 సంవత్సరాలలోపులో జరిగిన చెస్ పోటీలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన సందర్భంగా స్థానిక బారాస జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో ఛాంపియన్ పొందిన వారిని అధిగమించి విజయం సాధించిన రవిచంద్ర ఇంకా మున్ముందు జాతీయస్థాయిలో తన ప్రతిభను కనబరిచి తల్లిదండ్రులకు వనపర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో రవిచంద్ర తాతయ్య విశ్వమోహనా చారి సత్యనారాయణ చారి సత్యనారాయణ గౌడ్ మాధవ రావు పల్లి శ్రీనివాసులు ముజ్జు తదితరులు పాల్గొన్నారు
