వజ్రోత్సవ వన మహోత్సవం లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని KSR ఎనక్లేవ్ కాలనీ లో ఏర్పాటు

Spread the love

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం వజ్రోత్సవ వన మహోత్సవం లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని KSR ఎనక్లేవ్ కాలనీ లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటి ఫ్రీడం పార్క్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలనే మహా సంకల్పంతో భారత స్వాతంత్ర్య సమరంలో భాగంగా ‘డు ఆర్ డై’ అనే నినాదంతో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని గుర్తుచేసుకుంటు,ఎందరో మహనీయుల త్యాగాల ద్వారా సాధించుకున్న స్వతంత్ర భారతాన్ని సగర్వంగా నిలుపుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరమున్నదన్నారు.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను పదిహేనురోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ స్మరించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
మొక్కలు నాటడం చాలా సంతోషకరమైన విషయం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకుపచ్చని తెలంగాణా లక్ష్యంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరితహారం తో తెలంగాణ లో అడవుల శాతం పెరిగినది అని,
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి-వాటిని కాపాడాలిఅని, మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, సమస్త జీవ కోటికి ప్రాణధారం మొక్కలు అని ,కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం గూర్చి ప్రతి ఒక్కరికి తెలుసునని కావున దీనిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని , మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా ఖాళీ స్థలాలు,రోడ్లకు ఇరువైపులా,అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలి అని ,నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలని, మొక్కలు నాటాడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తెరాస నాయకులు మిర్యాల రాఘవరావు, లింగారెడ్డి, వెంకటేష్, రాజ్ కుమార్, ఓ.వెంకటేష్,పులిపాటి నాగరాజు,రవీందర్ రెడ్డి,నరేందర్ బల్లా,అక్బర్ ఖాన్,ఎల్లమయ్య, హరీష్ రెడ్డి, కార్తిక్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, కుమార్, అఫ్సర్, రాజశేఖర్ రెడ్డి
మరియు డివిజన్ నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page