SAKSHITHA NEWS

వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన………. బి సి ఎఫ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లను కేటాయించి నిజాయితీని చాటుకోవాలని విజ్ఞప్తి

సాక్షిత వనపర్తి
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణలో మక్తల్ బీసీ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరికి చోటు దక్కడం పట్ల బీసీఎఫ్ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రఅధ్యక్షులు నాగనమోని చెన్న రాములు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బిసిఎఫ్ శాఖల నాయకుల తో కలిసి బాణాసంచాలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చెన్న రాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాటను మంత్రి పదవిని మక్తల్ ఎమ్మెల్యే వాకిటీ శ్రీహరికి ఇచ్చి నిలబెట్టుకున్నారని అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లను కేటాయించాలని మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బీసీల పట్ల నిజాయితీని నిరూపించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం కులగణను చేపట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆడినెన్సు ద్వారా బీసీలకు రిజర్వేషన్లను అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకువచ్చి ప్రతిపక్ష పార్టీలు బీసీల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు అమరపాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపిటిసి ఏర్పుల తిరుపతయ్య యాదవ్ పి తిరుపతయ్య యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్రబాబు జిల్లా కార్యదర్శి బోల్లెద్దుల కృష్ణయ్య ఎస్సిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బహుజన రమేష్ పెబ్బేరు మండల ప్రధాన కార్యదర్శి బోయ శివకుమార్ నాయుడు బిసిఎఫ్ కార్మిక విభాగం వనపర్తి పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి మన్యం పెద్దిరాజు ధన్వాడ వెంకటేష్ ముదిరాజ్ రొయ్యల శివన్న జానంపేటబాలయ్య బొలెముని అంజి తదితరులు పాల్గొన్నారు