0 0
Spread the love

Read Time:2 Minute, 40 Second

ఉప్పల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు హర్షం వ్యక్తం చేసిన విద్యార్థి నాయకుడు వడ్ల వెంకటేష్ చారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ నియోజకవర్గంలో నూతన ప్రభుత్వడిగ్రీ కళాశాలకు అనుమతులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూన్నామన్నా విద్యార్థి నాయకుడు వడ్ల వెంకటేష్ చారి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యనందించడం కోసం డిగ్రీ కళాశాల మంజూరు చేయడం హర్షించ దగ్గ విషయమని వెంకటేష్ గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళాశాల మంజూరు కి పరిమితం కాకుండా తరగతిన భవన నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అని కోరారు అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సకల సౌకర్యాలు విద్యార్థుల కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని వెంకటేష్ చారి కోరారు. ఈ డిగ్రీ కళాశాలను ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో లో నిర్మించిన అట్లయితే దాదాపు ఘట్కేసర్ బీబీనగర్ మొదలుకొని రామంతపూర్ అంబర్పేట్ పరిసరాల వరకు పేద విద్యార్థులకు లాభంచేకూర్చేవిధంగా ఉంటుందని ప్రభుత్వం వన్ ఆ విధంగా ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలని వడ్ల వెంకటేష్ చారి కోరారు. అదేవిధంగా ఉప్పల్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి కూడా సహకరించి ప్రభుత్వం మంజూరు చేయాలని అలాగే అధికారులు ప్రజా ప్రతినిధులు కూడా కృషి చేయాలని విద్యార్థుల పక్షాన విద్యార్థి నాయకుడు వడ్ల వెంకటేష్ చారి డిమాండ్ చేశారు. కళాశాల మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి ,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజేష్, శివమణి, మహమ్మద్ సల్మాన్, విజయ్, భీముడు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love
You cannot copy content of this page