
జగన్ అవినీతి, ఆర్థిక విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కొత్త ఊపిరి పోసింది : మాజీమంత్రి ప్రత్తిపాటి
- పోలవరం, విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులతో పాటు జాతీయ రహదారులు, విద్య, వైద్య, వ్యవసాయ, పట్టణాభివృద్ధి రంగాల వృద్ధికి కేంద్రం అధికప్రాధాన్యత ఇచ్చింది : పుల్లారావు.
- మోదీ వికసిత భారత్ ఆవిష్కరణలో, చంద్రబాబు విజన్ 2047, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, కీలకపాత్ర పోషిస్తాయనడానికి తాజా బడ్జెట్టే నిదర్శనం : పుల్లారావు.
“ 2025-26 బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి ఎంతో ఉంది. జగన్ అవినీతి, ఆర్థిక విధ్వంసంతో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి పునర్న్మించడం కోసం కూటమిప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. దావోస్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీవెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిసి రాష్ట్ర అవసరాలు.. ప్రాధాన్యతలు వివరించారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై సానుకూలత వ్యక్తం చేసిన ఆమె ప్రాధాన్యతా విభాగాలు, రంగాలకు తగిన కేటాయింపులు చేయడం శుభపరిణామమనే చెప్పాలి అని మాజీమంత్రి ప్రత్తిపాటి తెలిపారు.
జాతీయప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరించాలి : పుల్లారావు.
నదుల అనుసంధానంలో దేశంలోనే కీలకమైన, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ కు రూ.5,936 కోట్లు కేటాయింపులు ఏపీ వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలుస్తాయి. ప్రతి బడ్జెట్లో పోలవరం నిర్మాణానికి గణనీయమైన కేటాయింపులు ఉంటాయన్న కేంద్రం బ్యాలెన్స్ గ్రాంట్ కింత రూ.12,157 కోట్లు కేటాయించడం గమనార్హం. జాతీయప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని నమ్మకముంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.3,295కోట్లు, విశాఖ పోర్టుకి రూ.730కోట్లు కేటాయించడం చెప్పుకోవాల్సిన విషయం. గత పాలకుల దుర్మార్గ పాలనతో అన్నిరకాలుగా కుదేలైన రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన కొత్తపద్దు కొత్త ఊపిరి పోసిందనే చెప్పాలి. ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధికి రూ.162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్‌కు రూ.375 కోట్లు, అలాగే, రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు, ఇరిగేషన్, లైవ్లీ హుడ్‌కు ప్రాజెక్టుకు రూ.242.50 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తనవంతు చేయూతనందించింది. ఇదే విధంగా కేంద్రం మున్ముందు మరింత చేయూతనివ్వాలని ఏపీ ప్రజల తరుపున కోరుకుంటున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవసరాలు, అభివృద్ధి దృష్ట్యా బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా మరిన్ని నిధులు రాబట్టేందుకు చంద్రబాబు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. వికసిత్ భారత్ లో నవ్యాంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించేలా, విజన్ 2047 దిశగా రాష్ట్రం పరుగులు పెట్టేలా చంద్రబాబు కీలక సంస్కరణలు అమలుచేయనున్నారు. తాజా బడ్జెట్ యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి వర్గం ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేలా ఉంది. ” అని మాజీమంత్రి ఆదివారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app