SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా రైతాంగం తరుపున రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో …

సాక్షిత : జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో రైతుల సమస్యలు అయిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల దాన్యం తూకం వేసిన వెంటనే రసీదు ఇవ్వడం (తక్ పట్టీ) తో పాటు, రైతులు పండించిన దొడ్డు దాన్యానికి సైతం ముఖ్యమంత్రి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 500 బోనస్ ఇవ్వాలని, జిల్లా వ్యాప్తంగా ప్రతి కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు దాన్యంతో పాటు, సన్న దాన్యం కొనుగోలు చెయ్యాలని, మన జిల్లా లో ఉన్న మిల్లులతో పాటు ఇతర జిల్లాల్లోని మిల్లులకు సైతం దాన్యం కేటాయించాలని, ధాన్యం తూకం తరువాత రైతులకు ఎలాంటి సంబంధం లేకుండా తేమ, తప్ప, తాలు పేరుతో ఇబ్బందులు లేకుండా చూడాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది….

ఈసందర్భంగా రైతు ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరి కొనుగోలు కేంద్రాల్లో రైతులని ఇబ్బందులకు గురి చేయకుండా కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటు దాన్యం తూకం అనంతరం రైతులకు మిల్లులతో సంబంధం లేకుండ రసీదు ఇప్పించడంతో పాటు, ప్రతి కొనుగోలు కేంద్రం లో సన్న దాన్యం సైతం కొనుగోళ్లు జరపాలని కోరారు. . .

ఈ కార్యక్రమం లో చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి, బందెల మల్లన్న, వేముల కర్ణాకర్ రెడ్డి, కంది బుచ్చి రెడ్డి, ఐలనేని సాగర్ రావు,కొట్టాల మోహన్ రెడ్డి,కర్నె రాజేందర్, పాపన్న, సోమిరెడ్డి బుచ్చి రెడ్డి, మ్యాకల మల్లేష్ యాదవ్, బద్దం మహేందర్ రెడ్డి,కోల నారాయణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS