SAKSHITHA NEWS

భర్త వరకట్న వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ – రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

ఆరు నెలల క్రితం గోవాలో వివాహం చేసుకున్న దేవిక (35), సతీష్

రాయదుర్గం పీఎస్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటు ఇరువురు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న దేవిక, సతీష్

ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ దేవిక

సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన భర్త సతీష్

పోలీసులకు, దేవిక కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించిన భర్త సతీష్

భార్యాభర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది

భర్త వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవిక తల్లి రామలక్ష్మి

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app