మహాత్మునికి ఘన నివాళులు..

Spread the love

Tributes to Mahatma..

మహాత్మునికి ఘన నివాళులు..
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

సామాజిక అసమానతలు తొలగించిన క్రాంతిరేఖ.. దీనజనుల జీవితాల్లో వెలుగు రేఖ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్దంతి సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు సోమవారం వీడియోస్ క్యాంపు కార్యాలయంలో పూలే సేవలను స్మరించుకుంటు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ జ్యోతిరావు పూలే చేసిన పోరాటంను వారు గుర్తుచేశారు. బలహీన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలేలు అమలు పరిచిన విధానాలను ఇప్పటికి ఆచరిస్తున్నామని పేర్కొన్నారు.


దేశంలోని పౌరుల్లో ఎక్కువ, తక్కువ అనే బేధాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు పూలే పాటు పడ్డారని తెలిపారు. బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు రావాలని ఆలోచన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఅర్ గారు అని పులే స్ఫూర్తితోనే రాష్ట్రంలో విద్యను బలోపేతం చేసి పేదలు, సామాన్యులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అనేక పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ భరోసాతోనే మన ఊరు- మన బడి ద్వారా ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారని గుర్తుచేశారు.


కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, తెరాస నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు మక్బూల్, దందా జ్యోతి రెడ్డి, ఆమృతమ్మ, మంత్రి పిఎ .సిహెచ్ రవి కిరణ్, నాయకులు సైదరావు, జక్కుల లక్ష్మయ్య, షకీనా, మందడపు నర్సింహారావు, స్వరూప, పాషా, మేకల సుగుణ రావు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page