SAKSHITHA NEWS

వెలిగొండ సాధన తోనే మస్తానయ్యకు నివాళి

మస్తానయ్య స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో మంగళవారం ఘనంగా కీర్తిశేషులు మస్తానయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కందుకూరు రోడ్డు లోని మస్తానయ్య స్మారక స్థూపం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వర ప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టు సాధన తోనే మస్తానయ్యకు ఘనమైన నివాళి అని నారాయణ అన్నారు. పామూరు ప్రాంత బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతర పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. మస్తానయ్య ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని ఎంఎల్ నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్డి మౌలాలి, పోతుల ప్రభాకర్, పాలపర్తి మస్తాన్ రావు, ఆకుల మోహన్ రావు, వజ్రాల సుబ్బారావు, రాగిపాటి సూరిబాబు, ఇవి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app