0 0
Spread the love

Read Time:2 Minute, 38 Second

కూడుకుపోయిన చెరువు కాలువ పూటిక పనులు చేపట్టండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్”మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని గురుదోట్ల ఊరి వెనుక తండా, బిల్యానాయక్ తండా మరియు గురుదోట్ల గ్రామంలో 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.

★ గురుదోట్ల గ్రామంతో పాటు ధారూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులతో మాట్లాడారు.

★ కూడుకుపోయిన చెరువు కాలువను పరిశీలించి, గ్రామస్థులకు రైతులకు ఇబ్బందులు కాకుండా సరిచేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు.

★ గ్రామంలో నిరూపయోగంగా ఉన్న పాత పాఠశాల భవనాలను పరిశీలించి, ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

★ ఊరి వెనుక తండాకు రోడ్డు నిర్మాణానికి కృషి చేద్దామని.. సంబంధిత అధికారులతో మాట్లాడారు.

★ గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, ఓల్టేజ్ సమస్య ఉందని కొత్త ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేయాలని, ఇళ్లపై మరియు పంటపొలాల్లో వేలాడుతున్న కరెంటు తీగలను సరి చేసి, బిల్యానాయక్ తండాలో నిరూపయోగంగా ఉన్న స్థంభాలను తొలగించి, కొత్త లైన్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలంన్నారు.

★ ఊరి వెనుక తండాలోని మిషన్ భగీరథ మంచినీటిని ట్యాంక్ లో నీటిని నింపుతూ… రెండు తండాలకు సరిపడ నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.

★ గ్రామంలో ప్రతీ గురువారం పశువుల డాక్టర్ అందుబాటులో ఉండాలని, పశు వైద్య అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page