SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీ పీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి  న్యాయవాది వేముల రమేష్”

(ఉమ్మడి వరంగల్ జోనల్ ఇంచార్జీ)

ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్  నిజాంబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీ పీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్  అధికార ప్రతినిధి వేముల రమేష్ న్యాయవాది సైదపూర్ మండల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి కార్య క్రమాలు మరియు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు, విద్యా వంతులు ఆదరిస్తున్నారని వేముల రమేష్ న్యాయవాది రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన విద్యా వంతుడు ఆల్ఫోరస్ విద్య సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో   మండల మార్కెట్ కమీటీ అధ్యక్షులు దొంత సుధాకర్, సహకార సంఘం చైర్మన్ తిరుపతి రెడ్డి  సీనియర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు, గుండారపు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ కిష్టయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సాయి కుమార్,
మార్కెట్ డైరెక్టర్లు, ఉడుగే రాజశేఖర్, యాదగిరి మరియు మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app