సెప్టెంబర్ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి:గవర్నర్ తమిళ్ సై

Spread the love


Today’s generation should know the history of Telangana on September 17: Governor Tamil

సెప్టెంబర్ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి:గవర్నర్ తమిళ్ సై.

హైదరాబాద్‌: తెలంగాణలో సెప్టెంబర్‌ 17వ తేదీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల వార్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కాగా, గ్రౌండ్‌లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలి. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదిలా ఉండగా.. కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఏడాది పాటు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సైతం విచ్చేయనున్నారు. మరోవైపు.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మాత్రం సెప్టెంబర్‌ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page