SAKSHITHA NEWS

నేడు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు

సమాజంలో ఉన్న లింగ అసమానతలను రూపుమాపే సంకల్పంతో జాతీయ బాలిక దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటాం

ప్రజల్లో అవగాహన కల్పన కోసం జనవరి 24 ను జాతీయ బాలిక దినోత్సవం గా నిర్వహిస్తున్నాం

పురుట్లోనే అమ్మాయిని చంపకుండా, అమ్మాయిలకు విద్యతోపాటు సురక్షితమైన వాతావరణాన్ని కలిగించేందుకు బాలిక దినోత్సవం దోహద పడుతుంది

జనవరి 24, 1966 లో దేశ తొలి మహిళా ప్రదానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేశారు

2008 లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఆ రోజును జాతీయ బాలిక దినోత్సవం గా ప్రకటించింది

ఉక్కు సంకల్పంతో దేశాన్ని ప్రగతి పథంలో ఇందిరా గాంధీ నిలిపారు

మహిళలకు అవకాశం కల్పిస్తే ఎన్ని విజయాలు సాధిస్తారో..ఇందిరా గాంధీ నిరూపించారు

బాలిక విద్య, ఆరోగ్యం, భద్రత కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది

వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది