
మహిళ మెడలో నుండి బంగారం చోరీ చేసిన దుండగుడు
సాక్షిత సూర్యాపేట జిల్లా : చివ్వేంల మండలం తిమ్మాపురం గ్రామం లో రాత్రి 7:30 గంటలకు నారెడ్డిధనమ్మ భర్త ( జానకిరెడ్డి) అనే మహిళ ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తన మెడలో ఉన్న 4తులాల పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు. ఆ సమయానికి ఊళ్లో కరెంట్ లేకపోవడంతో దుండగుడు అక్కడినుండి పరారయ్యాడు. మెడ నుండి తాడును బలంగా లాగడంతో ధనమ్మకు గాయాలయ్యాయి. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ధనమ్మ ఇంటికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయలతో ఉన్న దనమ్మను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app