
ఏపీ కేబినెట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలివే.
ఫ్రీ హోల్డ్ లాండ్స్‌పై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ.
ఇన్‌చార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి, సమీక్ష చేసి, వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు.
GSD వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను లక్ష్యం చేసుకోవాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
బడ్జెట్ సమావేశాలకు ముందు కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం.
ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే TIDCO ఇల్లు ఇవ్వాలని నిర్ణయం.
ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి స్థలాలు సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు.
అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఇవ్వడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన కేబినెట్.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఇచ్చినా భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని భావించిన కేబినెట్.
విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే సెంటీమెంట్ ఉందని, అందుకు అనుగుణంగా ప్లాంట్‌ను నడపాలని భావించిన కేబినెట్.
ఫ్రీ హోల్డ్‌లో ఉన్న 15 లక్షల 35 వేల ఎకరాల్లో 25 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని మంత్రి మనోహర్ చెప్పారు.
రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహాయం చేస్తుందని అందువలన.. మనం కూడా కేంద్రానికి అదేవిధంగా సహాయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.
శనివారం సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షా వస్తున్నారని, ఆయనతో డిన్నర్ మీట్‌లో మూడు పార్టీల నేతలు కలుస్తారని సీఎం చెప్పారు.
