ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి.
మృతు లు కుటుంబాలకి కోటి రూపాయలు పరిహాం ఇవ్వాలి.సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టిడిమాండ్.
సాక్షిత:- అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకైన ఘటనలో 27మంది కార్మికులు అస్వస్థకు గురవ్వగా ఇద్దరూ మృతి చెందారు. మృతి చెందిన కార్మికులు కుటుంబాలకికోటి రూపాయాలు నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూశుక్రవారం లంకెలపాలెం జంక్షన్ లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ
రాత్రి విష రసాయన వాయువులు లీకై 27మంది కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వీరిని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అభిత్ బాస్ (23) అనే కార్మికుడు చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో కార్మికుడు సిహెచ్ వీర శేఖర్ పిఠాపురం గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో ఇప్పటివరకు ఇద్దరు కార్మికులు మృతి చెందారు.మరో ఒక కార్మికుడు టి.చిన్నికృష్ణల పరిస్థితి విషమంగా వుంది. ఈ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలియకుండా వుండేందుకు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా యాజమాన్యం వారిని తరలించింది. సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గని శెట్టి అగ్ర వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గని శెట్టి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుందని, లాభాలే పరమావదిగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి తప్ప కార్మికుల ప్రాణాలు పట్టించుకోవడంలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాల పట్ల ఉదాసీనంగా వుండడం వల్లే తరుచూ ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికు కుటుంబాలకి కార్మిక శాఖ మంత్రి బాధ్యతారహితంగా కేవలం 40 లక్షల మాత్రమే ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికేఅనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీ లో సెనర్జీన్ లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించి పక్కనే ఉన్న ఠాగూర్ పరిశ్రమలో మృతులకి కేవలం 40 లక్షల ప్రకటించి కార్మిక శాఖ మంత్రి యాజమాన్యాలకి అండగా నిలిచారని మండిపడ్డారు. ముద్దుల కుటుంబాల కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని గని శెట్టి హెచ్చరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేసి ప్రమాదాలకు కారణమైన కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గని శెట్టి డిమాండ్ చేశారు.