SAKSHITHA NEWS

కేంద్ర బడ్జెట్ వల్ల పేదలకు, కార్మికులకు, నిరుద్యోగులకు ఉపయోగం లేదు.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్.

        పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మేడిపండు లాగా పైకి మంచిగా ఉండి లోపల మొత్తం ఉత్తదేనని, బడ్జెట్ ప్రవేశ పెట్టడాని నిరసిస్తూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట శాఖ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
   ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ దేశ ప్రజలు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతుంటే ఆ ధరలు తగ్గుదల గురించి మాట్లాడకుండా, నిరుద్యోగం పెరుగుతుంటే నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడకుండా, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని మాట్లాడకుండా, క్షీణిస్తున్న రూపాయి విలువ బలోపేతంపై చర్చించకుండా కేవలం పై పూతగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ బీహార్ లాంటి రాష్ట్రాలలో ఉన్న ఉద్యోగుల ఓట్లను సాధించడం పైనే దృష్టి పెట్టుకుని 12 లక్షల లోపు వారికి ఇన్కమ్ టాక్స్ రద్దు అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని దీనివల్ల కేవలం 7.5 కోట్ల మంది ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి 60 శాతం జనాభా  రైతులకు, రైతు కూలీలకు ఉపయోగపడేటువంటి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని ఇది కేవలం ప్రచార అర్బటానికి తప్ప ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని, తెలంగాణకు ఎటువంటి నిధులను కేటాయించకుండా రాష్ట్రాల పైన కూడా సవతి ప్రేమను చూపిస్తుందని, తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక నిధులు సాధించడంలో విఫలమయ్యారని వెంటనే గత బడ్జెట్లో చెప్పినట్లు బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం, మూసి ప్రాజెక్టు సుందరీకరణ, మెట్రో కారిడార్, రీజినల్ రింగ్ రోడ్ కి నిధులు తీసుకురావాలని లేకపోతే రాజీనామా అది ఇచ్చి సన్యాసం పుచ్చుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.
      ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావు, మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, కోశాధికారి సదానంద్, శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు అరవింద్, సిపిఐ నాయకులు ఇమామ్,  కొండన్న, ప్రభాకర్ నాగేష్ చారి, శ్రీనివాస్ చారి, చింటూ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app