కన్నతల్లిని మళ్లీ స్మశానంలో వదిలేసిన కొడుకులు
జగిత్యాల జిల్లా:
తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తు న్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్ర మాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూప డంలేదు. అనాధలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో వృద్ధు రాలు స్మశాన వాటికలో ఉంటున్న విషయము గత నెల 28న వెలుగులోకి వచ్చింది, అప్పుడు అధికా రులు ఆమె కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వగా ఇంటికి తీసుకెళ్లారు.
12 రోజుల తర్వాత వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని రెండవసారి స్మశాన వాటికలో వదిలి వెళ్ళిపోయాడు. మూడు రోజుల నుండి స్మశానం లో వృద్ధురాలు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపు తుంది,