మూడు రాజధానుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కర్నూలులో జరిగిన బహిరంగ సభ

Spread the love

The public meeting held in Kurnool was to sidestep the issue of three capitals

మూడు రాజధానుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ని మరియు ప్రజలను నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ :

ప్రభుత్వ విప్, వై.యస్.అర్.సి.పి పల్నాడు జిల్లా అధ్యక్షులు & జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి .

రాష్ట్రంలో ఉనికిని కోల్పోయి ఓటమి భయంతో భయపడుతున్న చంద్రబాబునాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఏకవచనంతో దూషించడంతోపాటు ప్రజలను సైతం దద్దమ్మలు అని దుర్భాషలాడటం సిగ్గుచేటు అన్నారు. 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాయలసీమ గురించి పట్టించుకోని నువ్వు ఈరోజు రాజధాని అనే అంశాన్ని పక్కదారి పట్టించడానికి అత్యంత దారుణంగా దిగజారి మాట్లాడటం శోచనీయం అని అన్నారు ఇదేవిధంగా సంస్కారం, సభ్యత్వ లేకుండా వ్యవహరించకూడదు.

బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ని మరియు వైసిపి నాయకులు దూషిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో 23 సీట్లు కూడా నిలబెట్టుకుని పరిస్థితి ఉంది కాబట్టే ఆవేదనతో భార్యను తనను దూషించినట్టున్నారు సానుభూతి డ్రామా ఆడుతున్నారు అని తెలిపారు. ఇటువంటి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మూడు రాజధానులకి వ్యతిరేకంగా ఏమి చెప్పలేక పక్కదారి పట్టించడానికి ఈ నాటకాలు ఆడుతున్నామని తెలిపారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబునాయుడు చేస్తున్న నాటకాలను గమనించి 2024 లో మరోసారి బుద్ధి చెప్పాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page