సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

Spread the love

The problems of students of welfare hostels should be solved

సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి 

 ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎస్. శరత్ కుమార్


కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎస్. శరత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించి,అనంతరం జిల్లా  బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ కి వినతిపత్రాన్ని అందజేశారు.


ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎస్. శరత్ కుమార్,సహాయ కార్యదర్శి జి.మునిస్వామి లు మాట్లాడుతూ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, దీంతో విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే వసతి గృహాల గోడలకు కరెంట్ షాక్ వస్తుందని, చాలా సందర్భాల్లో కరెంట్ షాక్ కు కూడా గురికావడం బాధాకరమని అన్నారు.

వసతి గృహాలకు పహారా గోడలు కరువయ్యాయని,అందువల్ల పందులు,కుక్కలు లోపలికి ప్రవేశించడంతో వాటితోనే సహజీవనం చేయాల్సి వస్తుందని అన్నారు. అంతేకాకుండా మరుగుదొడ్లు లేక రోడ్లపైకి వెళ్తున్నారని,దీంతో విద్యార్థులను జనం మందలించడం జరుగుతుందని అన్నారు.అదేవిధంగా మెనూ ప్రకారం ఆహారం అరకొరగా అందుతుందని,అందిన ఆహారంలో కూడా నాణ్యత లోపిస్తుందని అన్నారు.

 విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పలుమార్లు అధికారులకు విన్నపించిన, పట్టించుకోకుండా తనిఖీలు చేయకుండా, వారికి సీట్లకే పరిమితమై, వసతి గృహాల  విద్యార్ధుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు.విద్యార్థులు వార్డెన్లను అడుగుతే మాకు బిల్లులు రాలేదని చేతులెత్తే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమమే ముఖ్యమని చెపుతుందని, ఆచరించడలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు.కావున సంక్షేమ వసతి గృహాలను నాడు - నేడు పథకం కింద అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కావున అధికారులు స్పందించి, వసతి గృహాలలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరిన్నీ ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

          ...విప్లవాభివందనాలతో...
              ఎస్. శరత్ కుమార్
ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు, కర్నూలు.
             సెల్ :- 7993388790

Related Posts

You cannot copy content of this page

Compare