ప్రధాని నోట ‘నవోదయ’ పూర్వ విద్యార్థి రాజ్ కుమార్ నాయక్ మాట

Spread the love

ప్రధాని నోట ‘నవోదయ’ పూర్వ విద్యార్థి రాజ్ కుమార్ నాయక్ మాట

సూర్యాపేట:
ప్రధాని మోడీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ లో స్థానిక నవోదయ హై స్కూల్ పూర్వ విద్యార్థి పేరణినృత్య కారుడు ధరావత్ రాజ్ కుమార్ నాయక్ ను స్వయంగా ప్రధాన మంత్రి ప్రశంసించడం గర్వంగా ఉందని నవోదయ హై స్కూల్ ప్రిన్సిపాల్ మారం లింగా రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి విద్యను తమ పాఠశాలలో పూర్తి చేసిన రాజ్ కుమార్ నాయక్ ప్రధాన మంత్రి ప్రశంసించే స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు.రాజ్ కుమార్ నాయక్ తెలంగాణాలోని 31జిల్లాల్లో
101 రోజులపాటు పేరణి ఒడిస్సి నిర్వహించారని ఈ నాట్యానికి ప్రాణం పోస్తున్న రాజ్ కుమార్ తమ పాఠశాల విద్యార్థి కావడం గర్వంగా ఉందన్నారు.భవిష్యత్ లో రాజ్ కుమార్ కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తానని ఆయన తెలిపారు.

పేరణి నృత్యానికి బీజం పడింది ‘నవోదయ ‘లోనే:రాజ్ కుమార్ నాయక్

కళలన్న కళాకారులన్న నాకు చాలా ఇష్టం. పాఠశాల విద్యను స్థానిక నవోదయ పాఠశాలలో పూర్తి చేశాను.చిన్నప్పటి నుండి పేరణి నాట్యం మక్కువ ఎక్కువ. దీంతో పాఠశాలలో నిర్వహించే కల్చరల్ కార్యక్రమాల్లో ఎక్కువ గా పేరణి ప్రదర్శనలు చేసేవాణ్ణి. నాలో ఉన్న పట్టుదలను చూసి ప్రిన్సిపాల్ లింగారెడ్డి సార్ అనునిత్యం ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే నేడు నేను ఈ స్థాయిలో ఉన్న. ‘నవోదయ’ కుటుంబాన్ని, ఉపాధ్యాయులను ఎప్పటికీ మరిచిపోలేను.నవోదయ పాఠశాల ఓ బడిలా కాకుండా అమ్మ వడిలా అక్కున చేర్చుకొని నన్ను ఇంతవాణ్ణి చేసింది.కళాకారులను ప్రోత్సహిస్తూన్న అందరికీ ధన్యవాదాలు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page