
పేదవాడి మందులు నెలపాలు,
కాల్చివేసిన మందుల్ని రికవరీ చేస్తామంటున్న వైద్య అధికారులు
జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సాక్షిత వనపర్తి
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి విచ్చేసిన ప్రజల కోసం అత్యవసర పరిస్థితుల సమయంలో అత్యవసర వైద్యాన్ని అందించేందుకు వైద్యాధికారులు వైద్య సిబ్బంది మొబైల్ అంబులెన్స్ వాహనాలను సభ చుట్టు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటన బహిరంగ సభ కార్యక్రమాలు అంతా ప్రశాంతంగా ముగియడంతో ఎక్కడి వారు అక్కడికి వెళ్లి పోవడం జరిగింది కానీ అత్యవసర పరిస్థితుల కోసం వైద్యాధికారులు ఏర్పాటు చేసిన మందులు, ఓ ఆర్ ఎస్ పాకెట్లను డేట్ ఎక్స్పెయిడ్ కాకముందే పాలిటెక్నిక్ ప్రాంతంలోనే ప్రభుత్వ వైద్య సిబ్బంది పడేసి వెళ్లడం జరిగింది ఆదివారం జరిగినసభ తర్వాత మంగళవారం ఉదయం వాకింగ్ కోసం మైదానంలోకి వచ్చిన పట్టణ ప్రజలు అక్కడ పడవేసిన మందుల్ని మున్సిపాలిటీ చెత్త ఊడ్చే సిబ్బంది కాల్చి వేస్తున్న ఓ ఆర్ ఎస్ పాకెట్ల ను చూసి ఆశ్చర్యపోతూ కొంతమంది వారి సెల్ఫోన్లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా ఉన్నారు మరి కొందరు మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు ఇంకొందరు వైద్యాధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు
అయితే జిల్లాలోని 14 మండలాలలోని గ్రామాల నిరుపేద ప్రజలు అనారోగ్యాలతో మండలాలకేంద్రాల్లో ఉన్న ప్రాథమిక కేంద్రాల్లకు జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రికి వెళ్లి గంటలు రోజుల తరబడి ఓపి స్లిప్పు కోసం క్యూలో నిలబడి ఆపైన డాక్టర్ కన్సల్టింగ్ కోసం క్యూలో నిలబడి కన్సల్టింగ్ తర్వాత డాక్టరు రాసిన స్లిప్పు తీసుకొని మందుల కోసం అక్కడ క్యూలో నిలబడి తే కానీ అందని మందులు వైద్యాధికారులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పేదవాడి కందాల్సిన చెందాల్సిన మందుల్ని సభా కళాశాల ప్రాంగణంలో వృధాగా పడవేయడం కాల్చి వేయడం పట్ల ప్రజలు వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్లపై ఇలాంటి పరిస్థితులకు కారణభూతాలైన ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితిపై వైద్యాధికారులు శ్రీనివాసులు ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సంఘటన స్థలానికి విచ్చేసి పరిశీలించిన అనంతరం సీఎం పర్యటన సమయంలో డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది నుండి మందులను రికవరీ చేస్తామని బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామని అనడంతో కాలిపోయిన మందులని ఎలా రికవరీ చేస్తారని మీడియా ప్రతినిధులు వైద్యాధికాలను అడగడం అర్ధగంటలో సంఘటన స్థలానికి విచ్చేస్తామన్న వైద్యాధికారి శ్రీనివాసులు గంటలు గడిచిన అక్కడికి రాకపోవడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో ఉచితంగా అందాల్సిన ప్రభుత్వ వైద్యం, వైద్య సిబ్బంది వైద్యాధికారుల జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వల్ల ఉచితంగా అందాల్సిన ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో ప్రభుత్వాసుపత్రులు రెఫరల్ కేంద్రాలుగా మారిపోయాయని ప్రైవేటు ఆసుపత్రిలో ఖరీదైనవైద్య కేంద్రాలుగా మారాయని నిరుపేదలు తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఇల్లు వాకిళ్ళని మహిళలు పుస్తెలతాడుల ను అమ్మి అప్పులు చేసి పెట్టిన ప్రాణాలు నిలబడటం లేదని ఇంటి పెద్ద ను కోల్పోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయ ని ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులను పునరావృత్తం కాకుండా చూడాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app