SAKSHITHA NEWS

బండ్లపల్లి లో టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

మృతి చెందిన రాజేశ్వరి కుటుంబానికి అండగా ఉంటాం

మాజీ మంత్రి డాక్టర్ పల్లె, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీలోని నారాయణపురం గ్రామానికి చెందిన దేవినేని చిరంజీవి భార్య దేవినేని రాజేశ్వరి గారు నిన్నటి రోజు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజేశ్వరి లేని లోటు ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. అలాగే అదే గ్రామంలో కుంటిమద్ది లోకేష్ అనారోగ్య కారణాల వల్ల 20 రోజుల క్రితం మృతి చెందారు.ఈ సమాచారాన్ని తెలుసుకొని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు బైరాపురం సర్పంచ్ రవి, కిష్టప్ప ,మాజీ ఎంపీటీసీ సురేష్ ,టీడీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.