SAKSHITHA NEWS

ఏలూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ఒక అజ్ఞాత దాత 6 వీల్ చైర్స్ ను అందించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎం. ఎస్. రాజు చెప్పారు.

వీల్ చైర్స్ ను అందించిన దాత తన వివరాలు తెలియజేయవద్దని కోరారన్నారు.

సదరు వీల్ చైర్ ను రోగులను వివిధ వార్డులకు తీసుకువెళ్లేందుకు వినియోగించడం జరుగుతుందన్నారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన సేవలందిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, నర్సింగ్ సిబ్బంది ఎస్తేర్ రాణి, అమ్మాజీ, భారతి, ప్రభృతులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app