
పరమ శివుడి కృపా కటాక్షలు ప్రజలకు సిద్దించాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ… మహాదేవుని అభిషేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము
గుడివాడ :పరమ శివుడి కృపా కటాక్షలు రాష్ట్ర ప్రజలకు సిద్దించాలని… ప్రజలందరినీ మహాదేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాక్షించారు.
గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ఉదయం పాల్గొన్నారు.
ముందుగా పూర్ణకుంభంతో ఎమ్మెల్యే రాముకు వేద పండితులు స్వాగతం పలికారు. స్వామివారి కల్యాణ వస్త్రాలను శిరస్సుపై ఉంచుకొని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యే రాము దేవస్థానంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ అభిషేక పూజల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు.స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే రాము మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడులవాడగా ప్రసిద్ధిగాంచిన గుడివాడలో ఎంతో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. మహాదేవుని కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలు మరియు కూటమి ప్రభుత్వంపై ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు.
దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, టిడిపి నాయకులు పట్టపు చిన్న, వేద పండితులు, పలువురు కూటమి నాయకులు, ఎమ్మెల్యే రాముతో కలిసి శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app