
అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
సాక్షిత ::పట్టభద్రుల సమావేశంలో ఎన్డీయే కూటమి నేతలు
ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
యంపి కేశినేని శివనాద్ (చిన్ని) పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు కూటమి నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎమ్ ఎస్ బెగ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ టిడిపి, జనసేన, బిజెపి డివిజన్ల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్చ్ లు బూత్ ఇన్ చార్జ్ లతో కలిసి సోమవారం భవానిపురం లో ప్రచారం చేశారు.
పట్టభద్రులను, అధ్యాపకులను, ఉపాధ్యాయులను కలిసి ఎనిమిది నెలల కూటమిపాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు.
భవానిపురం లోని పలు పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన ఈ ఎన్నికలు రెఫరెండం వంటివని అన్నారు.
గత వైసిపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా దిగజార్చిందని ఆవేదన వ్యక్తపరిచారు. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సముచితమైన ఆలోచనలతో అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
యం యస్ బెగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం పెట్టుబడులను సమీకరించి పరిశ్రమలను నెలకొల్పు తున్నారన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్న కూటమి కి పట్టభద్రులు మద్దతిచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు విజ్ఞతతో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రచారంలో ఎన్డీయే కూటమి నేతలు యేదుపాటి రామయ్య, చిన్న సుబ్బయ్య, ముదిరాజ్ శివాజీ, నాగోతి రామారావు, మోరబోయిన రాంబాబు, మహేష్, మల్లికార్జున, బ్రహ్మారెడ్డి , రేగళ్ల వెంకట్రావు, వల్లభనేని లక్ష్మీ ప్రసన్న, సుకాసి సరిత, వేంపలి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app