SAKSHITHA NEWS

గత ప్రభుత్వ ధన దాహానికి ప్రస్తుత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఐదు నిండు ప్రాణాలు బలి.

సాక్షిత:(పల్నాడు జిల్లా, చిలకలూరిపేట)మహాశివరాత్రి నాడు తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం నందుగోదావరి లో శివరాత్రి పండుగ సందర్బంగా గోదావరి నదిలో 5గురు కాపు కులానికి చెందిన యువకులు ప్రమాద వాసత్తు మృత్యువాత పడటం జరిగింది. గోదావరి ఇసుకరీచులలో గత ప్రభుత్వం వారు ఇసుక తో పాటుఆ ప్రాంతంలో ఇసుక విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా ఆ పరిసర ప్రాంతాలలో ఎటువంటి హెచ్చరిక బోర్డు లు పెట్టకపోవడం, ఐదుగురి యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

యువకులు చనిపోయిన ప్రాంతంలో ప్రభుత్వం వారు ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనందువల్ల యువకులు చనిపోవడం జరిగింది. గత ప్రభుత్వంలోని నాయకుల ధన దాహం, ప్రస్తుత ప్రభుత్వ అధికారులు చేసిన నిర్లక్ష్యం వలన చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇది ప్రభుత్వం వారు చేసిన హత్యగా భావించి 1, తిరుమల శెట్టి పవన్ 2. పడాల దుర్గాప్రసాద్ 3. అనిశెట్టి పవన్ 4.గర్రీ ఆకాష5. పడాల సాయి,ల ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్
కొవ్వూరు మండల కన్వీనర్ ఏరు బండి వీర వెంకట్రావు కొవ్వూరు నియోజకవర్గం కన్వీనర్ పుప్పాల సత్యనారాయణ తాళ్లపూడి మండల అధ్యక్షులు నామన బుల్లి రాజు చాగల్లు మండల కన్వీనర్ ఇంటి దుర్గ ప్రసాద్ తదితరులు డిమాండ్ చేస్తా ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app